ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 3:40 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 లాభాల వాటా.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 లాభాల వాటా.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుకు ఐఎన్‌టీయూసీ నేతల కృతజ్ఞతలు.

కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఔట్‌సోర్సింగ్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // రామగిరి రిపోర్టర్:

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 లాభాల వాటాను మూడోసారి ప్రకటించిన నేపథ్యంలో ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఔట్‌సోర్సింగ్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ లాభాల వాటా అందించడం హర్షణీయమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులతోపాటు కాంట్రాక్ట్ కార్మికులకూ లాభాల వాటా ప్రకటించడం వల్ల కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు.

కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను గుర్తించి వారికి లాభాల వాటా అందించే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు ఇటువంటి నిర్ణయాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం ఆర్జీ-3 వైస్ ప్రెసిడెంట్ మబ్బు శంకర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఉడుత శంకర్ యాదవ్, రీజినల్ జనరల్ సెక్రటరీ బండ కిరణ్‌రెడ్డి, శ్రీరాముల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, నర్సరీ మహిళా కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.